రిబ్బన్ పురుగులు నెమెర్టైన్ పురుగులు. ఈ రకమైన పురుగులు పొడవుగా మరియు చదునుగా ఉంటాయి, రిబ్బన్ ముక్కలా కనిపిస్తాయి . నెమెర్టైన్ పురుగులు మృదువుగా ఉంటాయి. అయితే సముద్రంలో నివసించే రిబ్బన్ పురుగులు నీలి తిమింగలం కంటే పొడవుగా పెరుగుతాయి.
ఇవి ప్రపంచంలోనే అతి పొడవైన జంతువుగా నిలుస్తాయి. ఈ వేటాడే జంతువులు తమ ఎరను కప్పివేస్తాయి. ఇది ప్రోబోస్సిస్ లాంటి విషపూరిత ద్రవాన్ని రిలీజ్ చేస్తాయి. ఇది ఎరను చుట్టుముట్టి చంపుతాయి. ఇక రిబ్బన్ పురుగులు మనుషులకు చాలా ప్రమాదకరం.
ఈ జాతులకు సంబంధించిన కొన్ని పురుగులు టెట్రోడోటాక్సిన్ వంటి శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి. స్కిన్ ఇరిటేషన్, పక్షవాతం లాంటి సమస్యలకు దారి తీస్తాయి. అయితే ఇదొక వింత జీవి.. మనం ముట్టుకుంటే ఇక మటాష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. మీరు ఒక రిబ్బన్ లాంటి పురుగును చూడవచ్చు. దాన్ని ముట్టుకోనంత వరకు అది బాగానే ఉంది. ఎప్పుడైతే దాన్ని హాని చేసేందుకు పట్టుకుంటామో.. అప్పుడు ఓ తెల్లటి ద్రవాన్ని బయటకు వదులుతుంది. ఇక దీని గురించి వివరిస్తూ ఓ వ్యక్తి అది మనుషులకు ఎంతటి డేంజరో చెప్తాడు.
