ఉదయం నిద్ర లేస్తే తాగే కాఫీ, టీ మొదలు రాత్రి తాగే పాల వరకు చాలా మంది చక్కెరను తీసుకుంటారు. కానీ చక్కెరను అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ దీన్ని తీసుకోకుండా ఉంటే అనేక లాభాలు పొందవచ్చని వారు అంటున్నారు. అయితే భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
ఈ టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం, నాన్ ఆల్కహాలిక్ క్ ఫ్యాటీ లివర్ డిసీస్, గుండె జబ్బులు అనేక పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం. మెదడు పనితీరుకు ఈ గ్లూకోస్ ఎంతో అవసరం. మొత్తం శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు ఈ గ్లూకోస్. కానీ మన ఆహారంలో గ్లూకోస్ ను బయట నుంచి కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తినే ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను విచ్చిన్నం చేయడం ద్వారా మన శరీరం దానికి అవసరమైన గ్లూకోస్ ను తయారు చేసుకోగలదు.
పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి కార్బోహైడ్రేట్లు ఉన్న అన్ని ఆహారాలలో చక్కెర సహజంగా కనిపిస్తుంది. సహజంగా చక్కెర ఉన్న ఆహారాలను తీసుకోవడం హానికరం కాదు. కానీ మనం తినే ఆహారంలో బయటి నుంచి షుగర్ యాడ్ చేయడం వల్ల అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ బయటి నుంచి ఆడ్ చేసే షుగర్ తగ్గించడం వల్ల చాలా స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యాడెడ్ షుగర్ తగ్గించడం వల్ల మొదట్లో కొంత మందికి తలనొప్పి, అలసట మానసికంగా కొన్ని మార్పులు కనిపించడంతోపాటు.. భవిష్యత్తులో మంచి రిజల్ట్ కు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
యాడేడ్ షుగర్ అది రోజులపాటు పూర్తిగా మానేయడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలో మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం ఆరు రోజుల్లో మెరుగుపడుతుంది.. వారం రోజుల్లో మానసిక స్థితిలో మార్పు, పది రోజుల్లో చర్మం ప్రకాశవంతంగా మారడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. శరీర బరువులో మార్పులను గమనించడానికి కనీసం ఒక నెలపాటు షుగర్ కు దూరంగా ఉండాలని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు అంటున్నారు.
పెద్దలు రోజుకు 30 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తీసుకోవద్దని, రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు 14 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తినకూడదు. రోజువారి క్యాలరీలలో 10 శాతానికి పైగా ఉండకూడదు. ఐదు శాతంకి ఈ యాడేడ్ షుగర్ తగ్గిస్తే అదనపు ప్రయోజనాలు పొందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.
