నితిన్ నుంచి హిట్ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. ఈ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడీ క్రేజీ హీరో. ఈ ఏడాది మార్చిలో ‘రాబిన్ హుడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
ఇక గత నెలలో తమ్ముడు అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు నితిన్. అయితే హీరో నితిన్-షాలినీ దంపతులు గతేడాది సెప్టెంబర్ 06న అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. షాలినీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో గత నెలలో అవ్యుక్త్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నితిన్ – షాలిని.

అయితే అప్పుడు ఒకటి, రెండు ఫొటోలను మాత్రమే షేర్ చేశారు. తాజాగా నితిన్ భార్య షాలినీ తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి మరిన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నితిన్ కుమారుడి బర్త్ డే ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అవ్యుక్త్ చాలా క్యూట్ గా ఉన్నాడంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా తమ్ముడు అనే సినిమాలో నటించాడు నితిన్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బలగం దర్శకుడు వేణు తెరకెక్కిస్తోన్న ఎల్లమ్మ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే మరికొన్ని కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది.
