అవకాశాల్లేక వ్యభిచారంలోకి దిగిన స్టార్ హీరోయిన్, ఎయిడ్స్ రావడంతో..

divyaamedia@gmail.com
1 Min Read

ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఎన్నో చవిచూడవల్సి ఉంటుంది. వాటన్నింటినీ అదిగమిస్తేనే ఈ రంగుల ప్రపంచంలో భవిష్యత్తు ఉంటుంది. ఓ స్టార్ హీరోయిన్ తెలిసీతెలియని తనంతో జీవితంలో తప్పటడుగు వేసి అత్యంత దీనస్థితిలో తన జీవితానికి ముగింపు పలికింది. ఆమే నిషా నూర్‌. అయితే సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్‌ పాత్రలు పోషించి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి నిషా నూర్‌. చిరంజీవి, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఐతే దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సామెత ఈ నటి విషయంలో పూర్తిగా తలకిందులైంది. నటనను నమ్ముకుని తొలినాళ్లలో సినీరంగంలో మెరిసినా ఆ తర్వాత దిక్కు తోచని పరిస్థితిలో ఒళ్లు అమ్ముకుంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈ నటి అత్యంత దీన స్థితిలో 2007లో ఎయిడ్స్‌ వ్యాధితో మృతి చెందింది.

1980లలో నిషా నూర్‌ తన గ్లామర్‌తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. బాలచంద్రన్‌, విసు, చంద్రశేఖర్‌, భారతీరాజా వంటి గొప్పగొప్ప డైరెక్షన్‌లో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, భాను చందర్‌, రాజేంద్రప్రసాద్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. ఇక 1995 తర్వాత నిషా నూర్‌కు అవకాశాలు తగ్గాయి. సంపాదనంతా క్షణాల్లో ఆవిరైంది.

స్టార్‌డమ్‌ స్టేటస్‌ను అనుభవించిన ఆమె అవకాశాల్లేక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. బతకడానికి ఎంచుకుందో, మోసపోయిందో తెలియదుగానీ వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ బడా నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది. చివరి రోజుల్లో ఎయిడ్స్‌తో బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది.

ఓ తమిళ ఎన్జీవో సాయం చేసేందుకు ముందుకు వచ్చి ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎయిడ్స్‌తో పోరాడుతూనే 2007లో ఓ అనాధలా కన్నుమూసింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *