ఢీ ప్రోగ్రామ్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల్లో నటించింది. కొన్ని టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కూడా మెరిసింది. అయితే నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన కమిటీ కుర్రాళ్లు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
రూ.10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఇక తెలుగులో మనోజ్ నటిస్తోన్న ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నిహారిక హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం ఊపందుకుంది.

నిహారిక కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూస్తుంటే ఏదో శుభకార్యం, పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తోంది.ఈ ఫొటోలో నిహారిక పట్టుచీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆ ఫొటో చూస్తే నిహారిక నిశ్చితార్థం చేసుకున్నదనే చర్చ నడుస్తోంది.
పూర్తి ఫొటో పోస్టు చేయకుండా కేవలం చేయి.. పూలు కనిపించేలా షేర్ చేసి నెటిజన్ల మెదడుకు పదును పెట్టింది. అది కచ్చితంగా నిశ్చితార్థం ఫొటో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. అలానే నిహారిక నిశ్చితార్థం న్యూస్ కూడా వైరల్‌గా మారింది.