రాత్రికి రాత్రే ప్రాణం తీస్తున్న సైలెంట్ కిల్లర్..! చాలా మందికి తెలియక చేస్తున్న తప్పులు ఇవే.

divyaamedia@gmail.com
2 Min Read

ఏ సమస్యా చెప్పి రాదు అంటారు. కానీ..అనారోగ్యాలు మాత్రం కచ్చితంగా ఏదో ఓ సంకేతాన్ని ఇచ్చే వస్తాయి. ఆ సమయంలో ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా సరే..చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెడికల్ పరిభాషలో చెప్పాలంటే వీటిని సింప్టమ్స్ అంటారు. జ్వరం వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఫివర్ కచ్చితంగా వస్తుందని మనకి ఆ లక్షణాలను బట్టే అర్థమవుతుంది.

అయితే అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యే వస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు లక్షణాలు సరిగా తెలియకపోవడం వల్ల, సహాయం అందేలోపు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. రాత్రిపూట గుండెపోటు వచ్చే సాధారణ లక్షణాలు.. మీరు నిద్రపోతున్నప్పటికీ.. ఏదో సమస్య ఉందని శరీరం చిన్న సంకేతాలు ఇస్తుంది. ఈ ఐదు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం:-

ఛాతీ నొప్పి: ఛాతీని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించడం. ఈ నొప్పి నిద్ర నుంచి మిమ్మల్ని మేల్కొల్పవచ్చు. ఈ నొప్పి చేతులు, మెడ, దవడ లేదా వీపుకు కూడా పాకవచ్చు. ఆకస్మిక శ్వాస ఆడకపోవడం: ఊపిరి పీల్చుకోవడానికి కష్టం కావడం లేదా గాలి సరిపోవడం లేదని అనిపించడం. అసాధారణ చెమట: స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా చల్లని, జిగట చెమటలు పట్టడం. ఛాతీలో అసౌకర్యంతో పాటు ఇలా జరిగితే ప్రమాదకరం.

తలనొప్పి లేదా వికారం: కళ్లు తిరగడం, మూర్ఛపోయినట్లు అనిపించడం లేదా వాంతి వస్తుందని అనిపించడం. ఇది గుండెకు రక్త ప్రవాహం తగ్గడాన్ని సూచిస్తుంది. గుండె దడ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా గుండె వేగంగా లేదా క్రమం తప్పి కొట్టుకోవడం. ఎవరికి ఎక్కువ ప్రమాదం..? అధిక బీపీ, స్లీప్ అప్నియా, మధుమేహం, స్థూలకాయం, ధూమపానం, మద్యం అలవాటు, ఎక్కువ ఒత్తిడి.

నిద్రలో గుండెపోటు రాకుండా నివారణ చిట్కాలు.. కొన్ని మంచి అలవాట్ల ద్వారా ఈ ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం:- ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం:- గుండె బలంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేయండి. మంచి నిద్ర:- ప్రతిరోజూ తగినంత నిద్ర పోండి. స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోండి.

మానండి:- ధూమపానం, అధికంగా మద్యం సేవించడం పూర్తిగా మానేయండి. పరీక్షలు:- బీపీ, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఒత్తిడి తగ్గించుకోండి:- ధ్యానం లేదా యోగా వంటి వాటితో ఒత్తిడిని నియంత్రించండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *