50 ఏళ్ల వయసులో కొత్త బాయ్ ఫ్రెండ్‏ను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.

divyaamedia@gmail.com
2 Min Read

తన కంటే ఎంతో చిన్న వాడైన అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో పడిన 50 ఏళ్ల మలైకా అరోరా.. ఇప్పుడతనితో విడిపోయింది. ఈ ఇద్దరూ ఎంతో హుందాగా ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మలైకా అరోరా తన హాలిడేలో గుర్తు తెలియని వ్యక్తితో ఫోటో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. అతడి ముఖం అస్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మలైకా కొత్త ప్రేమపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాగే అర్జున్ కపూర్, మలైకా విడిపోయారని కొన్నిరోజులుగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతుంది. బ్రేకప్ రూమర్స్ పై అటు మలైకా, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. ప్రస్తుతం, మల్లా స్పెయిన్‌లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తోంది. ఈ హాలిడేకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే తాజాగా మలైకా షేర్ చేసిన ఫోటోలలో ఓ వ్యక్తి ఫోటో అస్పష్టంగా కనిపిస్తుంది.

బీచ్ వ్యూతో క్లామ్స్ ప్లేట్, బ్యాక్‌గ్రౌండ్‌లో అస్పష్టమైన మనిషి కనిపిస్తుండడంతో అతడే మలైకా న్యూ బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లివేడుకలలో కేవలం అర్జున్ కపూర్ మాత్రమే హాజరయ్యాడు. ప్రస్తుతం మార్బెల్లాలో విహారయాత్రలో ఉండడంతో అనంత్, రాధికే పెళ్లికి రాలేకపోయానంటూ మలైకా సోషల్ మీడియా ద్వారా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ ఏడాది వేసవి ప్రారంభంలో అర్జున్ కపూర్, మలైకా విడిపోయారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు.. ఇద్దరు కలిసి బాలీవుడ్ పార్టీస్, మూవీ ఈవెంట్లలోనూ కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం జరిగిన అర్జున్ కపూర్ బర్త్ డే సెలబ్రెషన్లలోనూ మలైకా కనిపించకపోవడంతో వీరిద్దరి బ్రేకప్ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మలైకా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *