నీతూ చంద్ర..సినీరంగంలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవాల్సిన పలువురు ముద్దుగుమ్మలు అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో నీతూ చంద్ర ఒకరు. గోదావరి సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సినిరంగ ప్రవేశానికి ముందు ఢిల్లీలో ఉంటూ వ్యాపార ప్రకటనలో నటించింది.
సినిమాలలో నటించడంకోసం ముంబై వచ్చి, 2005 లో వచ్చిన గరం మసాలా అనే హిందీ సినిమాలో తొలిసారిగా నటించింది. 2006లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. నిర్మాతగా మారి తమ్ముడు నితిన్ చంద్ర దర్శకత్వంలో దేశ్వా సినిమాను నిర్మించింది. అయితే 1984 జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించిన నీతూ.. గ్రాడ్యూయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
2003లో విష్ణువు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. కేవలం గోదావరి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో ఆడపాదడపా సినిమాల్లో కనిపించింది.
2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు..ప్రస్తుతం వ్యాపారరంగంలోకి దూసుకుపోతుంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ నీతూ చంద్ర ఏం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.