తన మ్యారేజ్‌కు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రకటన చేయని నీరజ్ చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పెళ్లికి సంబంధించి 3 ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇందులో తన తల్లితో దిగిన ఓ ఫొటో కూడా ఉంది. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే నీరజ్ హిమానీల పెళ్లి హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా నీరజ్ చోప్రా షేర్ చేసుకున్నారు.
మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కింద పోస్ట్ లో రాసుకు వచ్చారు. ఇక హిమాని ప్రస్తుతం ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ మేనేజ్మెంట్ చేస్తున్నారు.సోనిపత్‌లో హిమాని విద్యాభ్యాసం పూర్తి చేసింది. సోనిపత్ టెన్నిస్ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే, హిమాని కూడా టెన్నీస్ ప్లేయర్. 2017 తైపీ వరల్డ్ యూనివర్షిటీ గేమ్స్ నేషనల్ లెవల్స్ లో పాల్గొన్నారు.
అంతేకాదు ఆమె స్కూలు వెబ్ సైట్ ప్రకారం మలేషియాలో 2016లో జరిగిన వరల్డ్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ సాధించారు. ప్రస్తుతం యూఎస్ లో చదువుతుంది. అయితే, నీరజ్ చోప్రా రెండుసార్లు ఒలింపిక్ పథకాలను సాధించారు. అయితే, నీరజ్ హిమానీలు ఇప్పటికే హనీమూన్ కోసం అమెరికాలో ఉన్నారు. వాళ్లు తిరిగి వచ్చిన వెంటనే భారత్ లో త్వరలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

నీరజ్ చోప్రా ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా మొదటి సింగిల్ గోల్డ్ మెడల్ భారత విన్నర్‌గా రికార్డు సృష్టించారు. హిమానీ మసచూస్సెట్ కాలేజీలో మహిళా అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8