నీరజ్, హిమానీ అమెరికాలో కలుసుకున్నారని నీరజ్ అంకుల్ సురేంద్ర చోప్రా వెల్లడించారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో నీరజ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం అని ఆయన పేర్కొన్నారు. పెళ్లికి ముందు హిమానీ, నీరజ్ సొంతూరు హర్యానాకు వెళ్లింది. అయితే నీరజ్ చోప్రా తన అత్తామామల నుంచి ఎంత కట్నం తీసుకున్నాడనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నీరజ్ చోప్రా పెళ్లి కోసం అసలు కట్నం తీసుకోలేదట.
అయితే వద్దనుకోకుండా అత్తా మామల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా మేనమామ సురేంద్ర చోప్రా వెల్లడించారు. ‘నీరజ్ చోప్రా వివాహం సంప్రదాయ పద్ధతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని సురేంద్ర చోప్రా తెలిపారు. నీరజ్ చోప్రా మామ కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే విషయాన్ని కూడా బయటపెట్టాడు.
‘ఇరు కుటుంబాల అంగీకారంతోనే నీరజ్ చోప్రా వివాహం జరిగింది. హర్యానా సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లిని మాటల్లో చెప్పలేనంతగా ఎంజాయ్ చేశాం. నీరజ్ పెళ్లికి కట్నం తీసుకోలేదు. ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు’ అని సురేంద్ర చోప్రా చెప్పారు. ఈ వివాహం గురించి సమాచారం ఇస్తూ, నీరజ్ చోప్రా రెండవ మేనమామ భీమ్ చోప్రా మాట్లాడుతూ’ ఈ వివాహానికి చాలా రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. నీరజ్, హిమానీ ఇద్దరూ గత రెండేళ్లుగా ఒకరికొకరు తెలుసు. వారు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు.
ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గత కొన్ని నెలలుగా నీరజ్ మరియు హిమానీల పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి. నీరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని మాకు, హిమాని కుటుంబానికి మాత్రమే తెలుసు. కనీసం ఈ విషయం పురోహితుడికి కూడా తెలియదు. నీరజ్ కూడా అదే కోరుకున్నాడు’ అని చెప్పుకొచ్చారు.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8