అరుదైన నీలి రంగు నాగుపామును ఎప్పుడైనా చూశారా..? ఇది ప్రత్యేకత తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

పొలాల్లో పనిచేస్తున్న రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వారు తరచుగా పాములను చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా పాములు అడవులు, పొలాలు, గడ్డివాములు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తాయి. చాలా మంది పామును చూసిన క్షణం భయంతో వెనక్కి తగ్గిపోతారు. కానీ కొంతమంది మాత్రం భయపడకుండా పాముల దగ్గరికి వెళ్లి వాటితో రిస్కీ స్టంట్లు చేస్తుంటారు. ఈ రకమైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల అలా వైరల్ అయిన ఒక వీడియోలో ఓ రైతు తన పొలంలో పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా ఒక నీలం రంగు నాగు పాము నేల నుంచి బయటకు వచ్చింది. అది బుసలు కొడుతూ తలెత్తి నిలబడ్డ విధానం రైతును షాక్‌కు గురిచేసింది. భయంతో అతను వెనక్కి తగ్గి పామును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ నీలి పాము పడగ విప్పి కదలకుండా కొంతసేపు అక్కడే నిలబడి ఉంది. తర్వాత మెల్లగా చెట్ల వైపు చేరి కనిపించకుండా పోయింది.

ఈ రకమైన నీలం పాములు చాలా అరుదుగా బయటకు వస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత లేదా వాతావరణ మార్పుల సమయంలో ఇవి బైటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. రైతులు, గ్రామీణులు ఇలాంటి పాములను చూసినప్పుడు దూరంగా ఉండి, వాటిని చంపకుండా.. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆ నీలం పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఆ పామును చూసి ఆశ్చర్యపోతూ.. ‘ఇంత అందమైన పాము నిజంగా ఉందా?.. లేక ఇది ఏఐ వీడియోనా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫిల్డర్ వాడి పాము కలర్ మార్చారని చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *