Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించిన నయనతార తన నటనతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.చంద్రముఖి, గజినీ చిత్రాల సక్సెస్ తో నయనతార స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. లక్ష్మి, యోగి, దుబాయ్ శ్రీను, అదుర్స్ వంటి హిట్ చిత్రాలతో తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ వివాదాలే. ముఖ్యంగా రెండు పర్యాయాలు ఆమె ప్రేమలో విఫలం చెందింది. కెరీర్ ప్రారంభంలోనే నయనతార శింబుతో డేటింగ్ చేసింది.
ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది నయన్. ప్రభుదేవా తన ప్రేమలో భాగంగా నయనతార కోసం తన భార్య రమలతకు విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఈ మ్యాటర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభుదేవా, నయనతార మూడు ముళ్ళ బంధంతో ఒకటి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ప్రధానంగా వినిపించాయి.
అయితే తాజాగానెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ Nayanthara: Beyond the Fairy Taleలో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. తెలుగులో వచ్చిన శ్రీరామరాజ్యం తన చివరి సినిమా అనుకున్నానంది నయనతార . తాను సినిమాలను విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ తనను పెళ్లి చేసుకోవాలంటే యాక్టింగ్ వదిలేయాలని షరతు పెట్టినట్లు చెప్పింది. పెళ్లికి ముందు నటించడం మానేయమని అప్పటి తన ప్రియుడు కండిషన్ పెట్టాడని స్పష్టం చేసింది.
Also Read : రామ్‌గోపాల్‌కు వర్మకు నోటీసులు..త్వరలో జైలుకు
దివంగత లెజెండరీ దర్శకుడు బాపు డైరెక్ట్ చేసిన శ్రీరామరాజ్యంలో నయనతార సీతగా నటించిన విషయం తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ చివరి రోజున ఇదే తన చివరి సినిమా అని భావోద్వేగానికి కూడా లోనైంది. అయితే ఆ తర్వాత మాత్రం అలాంటి షరతులేమి లేకుండా సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది నయనతార. మొత్తానికి సినిమాలు వద్దని చెప్పింది ప్రభుదేవానే అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చేసిందని ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది.
Also Read : హార్ట్ ప్రాబ్లమ్ తో బాధ పడుతున్న పవన్ మాజీ భార్య .