స్టార్ హీరోయిన్ నయతార ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి. నయన తార సినీ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గజినీ మూవీ మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 2008 లో విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. అయితే నయన తార ఇటీవల తరచుగా ట్రెండింగ్ లో ఉంటున్నారు. కొన్నిసార్లు సినిమాలకు చెందిన మూవీస్ అప్ డేట్ లతో వార్తలలో ఉంటే.. మరికొన్నిసార్లు ఏదో ఒక గొడవలతో వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
దీనిపై తాజాగా, నయన తార స్పందించారు. అంతే కాకుండా.. దీనిపై క్లారిటీ సైతం ఇచ్చారు. తనకు హైబ్రోస్ అంటే ఎంతో ఇష్టమని, తరచుగా డిఫరెంట్ స్టైల్ లో కట్ చేసుకుంటానని చెప్పారు. దీంతో తన ముఖంలో కొన్ని మార్పులు వచ్చినట్లు కన్పిస్తుందన్నారు. నిజానికి తను ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇలాంటి లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేయడం మానుకొవాలన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా, నటి నయనతార ఫ్యామిలీకి చెందిన మరో అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. నయన తార విఘ్నేశ్ శివన్ లకు పెళ్లైన విషయం తెలిసిందే. వీరిద్దరు సరోగసి విధానంలో పిల్లల్ని కన్నారు.
ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. అయితే.. నయన తార పెళ్లి జరిగిన తర్వాత తన ఆస్తులు కూడా భర్త పేరుపైన ట్రాన్స్ ఫర్ చేసిందంట. నయన తార ప్రాపర్టీతో కంపేర్ చేస్తే.. విఘ్నేశ్ శివన్ ఆస్తులు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో నయనతార తల్లి కూడా దీనికి ఎలాంటి అడ్డు కూడా చెప్పలేదంట. అయితే.. నయన తారతో పాటు, ఆమె తల్లి కూడా ఎక్కువగా వీరితో పాటు ఉంటారు. నయన తార తన తల్లి చెప్పిన ప్రతి విషయం పాటిస్తుందంట.
తాజాగా, నయన తార తల్లి ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ మీద ఉన్న ఆస్తుల్ని పిల్లలు.. ఉయిర్, ఉల్గంలపై ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పిందంట. దీనికి నయన తార కూడా ఓకే చెప్పిందంట. కానీ ఈ విషయంపై మాత్రం విఘ్నేశ్ శివన్ కాస్తంతా డిసప్పాయింట్ లో ఉన్నాడంట. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ రూమర్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది నెటిజన్ లు మాత్రం దీనిపై పండగ వేళ అత్తపెద్ద కుంపటి పెట్టిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.