నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది.
అయితే ఎందుకు ముఖ్య కారణం ఆమె ఈమధ్య ఆమె సోషల్ మీడియా అకౌంట్లో ఒక స్టేటస్ షేర్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఎంతోమంది దాన్ని కాస్త స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకున్నారు. “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే పురుషులు సాధారణంగా అంతా..మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా.. మీవల్ల,” అని రాసుకుంది. అయితే ఇలా పోస్ట్ చేసిన.. కొద్దిసేపటికే ఆమె దాన్ని డిలీట్ చేసినప్పటికీ, ఆ పోస్ట్ కాస్త అది స్క్రీన్షాట్ల రూపంలో వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్ నయనతార, విఘ్నేశ్ శివన్‌ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయనే అనుమానాలను కలిగించడమే కాకుండా చాలామందికి.. నయనతార కూడా త్వరలో డైవర్స్ తీసుకోనిందా అని అనుమానాలు తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం నయనతారకు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్యనే నయనతార, విగ్నేష్ ప్రేమ కథ కూడా నెట్ ఫ్లిక్స్ వారు డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.