నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం. ఎక్కడో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

దుర్గాదేవి వివిధ విగ్రహాలు, చిత్ర పటాలను మనం చూస్తే అమ్మవారు రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆయుధాలు వారి శక్తికి చిహ్నంగా మాత్రమే కాకుండా లోతైన మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. దుర్గాదేవిని శక్తికి అధిష్టానం దేవతగా పరిగణిస్తారు. అయితే హుశా ఈ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది షక్తో సంప్రదాయం. ఈ సంప్రదాయంలో దుర్గామాతను సర్వోన్నత శక్తిగా కొలుస్తారు.

మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని పండుగ రూపంలో జరుపుకుంటారు. ఆ విజయోత్సవానికి ప్రతీకగా మాంసాహారం వండి, విందు చేసుకుంటారు. ఇది కేవలం ఆహారం కాదు, దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె శక్తిని, సంపదను, సుఖ సంతోషాలను ఆహ్వానించడానికి చేసే ఒక ఆచారం. చేపలు, మటన్‌కు బెంగాలీ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఓ బెంగాలీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే, చేపలు, మటన్‌ వంటకాలు తప్పనిసరి.

పెళ్లిళ్లు, ఇతర పండుగలకు ఇవి శుభ సూచకంగా భావిస్తారు. దుర్గామాత తన పుట్టింటికి వచ్చిందని నమ్ముతారు. తమ ఇంటికి వచ్చిన కూతురును ఆప్యాయంగా చూసుకోవడానికి, రుచికరమైన వంటకాలతో విందు ఇవ్వడానికి ఈ వంటకాలను తయారుచేస్తారు. ఇది భక్తితో పాటు, ఆనందాన్ని, ఉత్సవాన్ని సూచించే ఓ సంప్రదాయం. ముఖ్యంగా, కొన్ని ప్రాంతాల్లో దుర్గామాతకు చేపలను ‘భోగ్’గా కూడా సమర్పిస్తారు.

నవరాత్రి సమయంలో సాధారణంగా సాత్విక ఆహారం (ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారం) తింటారు. అయితే బెంగాల్‌లోని కొన్ని శక్తో ఆలయాల్లో, ముఖ్యంగా కాళీ పూజ సమయంలో, మాంసం, చేపలు భోగ్ రూపంలో సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. ఈ వంటకాలను ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేకంగా తయారుచేస్తారు. దీనిని ‘నిరామిష్ మాంగ్షో’ (నిరామిష మటన్) అని పిలుస్తారు. ఈ విధంగా, దుర్గా పూజ సమయంలో చేపలు, మటన్‌ను వండటం కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అది బెంగాలీల సంస్కృతిలో భాగమైపోయిన ఒక లోతైన సంప్రదాయం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *