సినిమాకు ప్రాణం పోసింది మాత్రం అందులో ‘చాయ్‌పౌ’ అనే రోల్ చేసిన 12 ఏళ్ల కుర్రాడు. అతని నేచురల్ యాక్టింగ్, కళ్లలో పలికించిన ఆవేదన ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యాయి. ఈ అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఒప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన.. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు లేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగి, ఆస్కార్ బరిలో నిలిచిన ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఆ నటుడు.. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతను నటించిన సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. కానీ ఆతర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పేరు షఫీక్ సయ్యద్. సలాం బాంబే! సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు.
1988లో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు. ఈ సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. ఈ సినిమాలో చాయ్‌పౌ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
కానీ అతనికి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆతర్వాత ‘పతంగ్’ అనే సినిమా ఒక్కటే చేశాడు. అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు.కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్.