సడన్ గా వదిలేసి వెళ్ళిపోయింది, ఒంటరైన నరేష్ కన్నీరు మున్నీరు. వైరల్ వీడియో

divyaamedia@gmail.com
2 Min Read

టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడు నరేష్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఏడాదికి పదుల సంఖ్యలో నరేష్ చిత్రాలు చేస్తున్నారు. నటుడిగా సక్సెస్ అయిన నరేష్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆయన పలుమార్లు విఫలం చెందాడు. అయితే నటుడు నరేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియోకు కారణం తన కొత్త సినిమా ప్రమోషనే. ఈరోజుల్లో సినిమా తెరకెక్కించడం కంటే ప్రమోషన్స్ చేయడమే చాలా కష్టమైంది.

జనాలకు తమ సినిమాను ప్రచారం చేయడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవలే డార్లింగ్ సినిమా కోసం ప్రియదర్శి, నభా నటేష్ కొత్తగా ట్రై చేయగా.. ఇప్పుడు నరేష్ కూడా తన కొత్త సినిమా వీరాంజనేయులు విహారాయాత్ర కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడన్నమాట. ఈ చిత్రంలో నరేష్ తోపాటు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో రూపొందించిన ఈసినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకత్వం కాబోతున్నాడు.

అలాగే ఈ మూవీలో కీడా కోలా ఫేమ్ రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడు గొడవలు పడుతుంటే ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లి సరదాగా గడపాలని నిర్ణయించుకుంటుంది. దీంతో ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లాలనుకుంటారు. ఇందుకు తమ వద్ద ఉన్న పాత మెటాడోర్ వ్యాన్ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబుచేస్తారు. ఈ గోవా ప్రయాణంలో తమకు ఎదురైన పరిస్థితులే ఈ సినిమా అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు నరేష్ షేర్ చేసిన ఒక్క వీడియోతో ఈ సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేయడంతో ఈ వీడియోకు ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. అటు కల్కి అడియన్స్, ప్రభాస్ అభిమానులు కూడా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. బేబీని కనిపెట్టడంలో బైరవ బుజ్జి హెల్ప్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *