టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడవుతున్నాడు. హైదరాబాద్ నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రతినిధి-2 సినిమాలో రోహిత్‌తో కలిసి నటించింది శిరీష.
ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. డిసెంబర్ 15న వివాహం జరగనుంది. అయితే హీరో నారా రోహిత్ గురించి మనందరికి తెలిసిందే. అయితే సిరి లేళ్ల గురించి చాలా మందికి తెలియదు.
దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చాలామంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ కూడా చేసింది. అయితే సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చేసింది. అప్పుడే ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్ జరుగుతుండగా వెళ్లింది. లక్కీగా హీరోయిన్ గా ఎంపికైంది.
ఇక నారా రోహిత్ తో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. మొదట హీరో తన విషయాన్ని తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పాడట. ఆమె అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. ఇందుకు సిరి లేళ్ల కుటుంబం కూడా ఒప్పుకోవడంతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారట. ఈ ఏడాది డిసెంబర్ లోనే రోహిత్- సిరిల వివాహం జరగనుంది.