హీరోలు లేదా హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారి కుటుంబాల్లో వరుసగా పెళ్లి బజాలు మ్రోగుతున్నాయి. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారట. 40 ఏండ్ల లేటు వయస్సులో పెళ్లి పీటలు ఆ తెలుగు హీరో ఎవరో ఓ లూక్కేయండి. ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు. నారా వారబ్బాయి నారా రోహిత్ . ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
‘బాణం’ అనే సినిమాతో ఇండస్ట్రీపై గురిపెట్టారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు.
అయితే రా రోహిత్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్టోబర్ 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ కి కాబోయే భార్య ఎవరో కాదు ప్రతినిధి 2 చిత్రంలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
నారా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ.. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సంబంధం కుదరడంతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక పాత్ర వహించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగే నిశ్చితార్థానికి చంద్రబాబు ఫ్యామిలీ, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ హాజరవుతాయట. ప్రస్తుతం నారా రోహిత్ సుందరకాండ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇటీవల టీజర్ కూడా విడుదలయింది.