Nara Rammurthy Naidu | టాలెంటెండ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్థం గత నెలలో జరిగిన విషయం తెలిసిందే. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లా ను వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది.. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఆ సంగతి కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రామ్మూర్తినాయుడు. ఈ క్రమంలోనే నవంబర్ 14న కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
ఇదిలా ఉంటే చంద్రబాబు వెంటే కాంగ్రెస్ లో ఉన్న రామ్మూర్తి నాయుడు ఆయన టీడీపీలో చేరితే తాను కూడా అదే పార్టీలో ఉండేవారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని చూసేవారు. ఆయనకు రాజకీయాల్లో పోటీ చేయాలని కోరిక మాత్రం 1994లో వచ్చిందని చెబుతారు. ఆయనకు టికెట్ ని అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. అలా ఆయన 16 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వచ్చారు.ఇక 1999లో అదే నియోజకవర్గం నుంచి టికెట్ ని చంద్రబాబు పార్టీ అధినేతగా ఇస్తే కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.
Also Read : పాట్నాలో పుష్ప 2 ట్రైలర్.. పాన్ ఇండియా అంటే అంతేగా మరి ..
2004లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా 32 వేలకు తక్కువ కాకుండా ఓట్లు సాధ్యించారు అంటే చంద్రగిరిలో ఆయనకు ఉన్న పట్టు తెలుస్తుంది అని అంటారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ లో చేరిన రామ్మూర్తి నాయుడు ఆ మీదట పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పారు.రామ్మూర్తి నాయుడి భౌతికకాయాన్ని నారావారిపల్లెకు తరలించాలని నారా కుటుంబ సభ్యులంతా నిర్ణయించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం 6:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి నారావారిపల్లెకు ఆయన పార్థివదేహం ఎయిర్ లిఫ్ట్ కానుంది. మరోవైపు రేపు ఉదయం సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు సహా బంధువులంతా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు విచ్చేయనున్నారు.
‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగా ఉంది, మన తెలంగాణలోనే.. ఎక్కడంటే..?