హీరోయిన్ గా బాలయ్య కూతురు బ్రాహ్మణి ఆఫర్, దీంతో బాలయ్య ఏం చేసాడో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

బాలకృష్ణ పెద్ద కుమార్తె .. నారా బ్రాహ్మణి ప్రత్యేకంగా పరిచయం పనిలేదు.. నారా లోకేష్ భార్యగా అలాగే ఆంధ్రా సీఎం చంద్రబాబు కోడలిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.అదే సమయంలో బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది బ్రాహ్మణి. అయితే ఆమె గురించి అంతకు మించి పెద్దగా బయిట ఎవరికీ ఏమీ తెలియదు. అయితే ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బాలయ్య గుర్తు చేసి అందరికీ చెప్పారు. ఇదంతా పక్కన పెడితే పెద్ద కూతురు బ్రాహ్మణి ఇప్పటి తరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు.

నందమూరి కుటుంబం మొత్తం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది కదా, ఇంత అందం పెట్టుకొని బ్రాహ్మణి ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనే సందేహం అభిమానుల్లో ఎప్పటి నుండో ఉంది. ఆ సందేహాలకు బాలయ్య నిన్న అన్ స్టాపబుల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘బ్రాహ్మణి ని హీరోయిన్ ని చెయ్యాలనే కోరిక నాలో చాలా ఉండేది. ఆమెని సినిమాల్లో నటించమని ఎన్నోసార్లు అడిగాను కూడా. కానీ ఆమె నాకు ఇష్టం లేదు అంటూ రిజెక్ట్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.

రెండవ కూతురు తేజస్విని కూడా చాలా తెలివైన అమ్మాయి అని, ఆమెకు కూడా సినిమాల మీద ఆసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సినీ రంగం మీద వాళ్ళిద్దరికీ ఆసక్తి లేకపోయినా, వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఎంతో గొప్ప రాణించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందంటూ కొనియాడారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఆ చిత్రానికి సంబంధించిన మూవీ టీం మొత్తం ఈ ఎపిసోడ్ లో పాల్గొని సందడి చేసారు.

డాకు మహారాజ్ విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ చాలా సరదాగా సాగిపోయింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని చూడాలంటే వెంటనే ఆహా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవలే రామ్ చరణ్ తో కూడా ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు. మరో రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *