‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మహిళా డైరెక్టర్ నందిని రెడ్డి . మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటిన నందిని.. ఆ తర్వాత తీసిన ఒకటి రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ తన చివరి చిత్రం ‘ఓ బేబీ’తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయగలిగింది. అయితే నందిని రెడ్డి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు ఆమె ఎప్పుడూ అమ్మాయిలా కనిపించదు. ప్యాంట్, షర్ట్ లోనే ఉంటుంది. అబ్బాయిగానే కనిపిస్తుంటుంది. ప్యాంట్, షర్ట్ లో తప్ప చీర, చుడీదార్‌లో కనిపించింది లేదు. చాలా అరుదు. మరోవైపు నాలుగు పదులు దాటినా మ్యారేజ్ చేసుకోలేదు.
మరి ఎందుకు ఆమె ఒంటరిగా ఉంటుంది? ఈ గెటప్‌కి కారణమేంటి? అనేది చూస్తే, నందిని రెడ్డి తన గురించి పలు షాకింగ్ విషయాలను, ఆసక్తికర విషయాలను, ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ని వెల్లడించింది. మగరాయుడి గెటప్ గురించి చెబుతూ, తాను చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ ఆడేదట. ఆ సమయంలోనే ప్యాంట్, టీషర్ట్ కంఫర్ట్ గా ఉండేవి, టీనేజ్‌లో అదే తనకు బాగా అలవాటు అయ్యిందట. దాన్నే ఫాలో అవుతున్నట్టు చెప్పింది. లేడీస్‌కి సంబంధించిన చీరలు, స్కర్ట్స్ కూడా తాను ధరించానని, కాకపోతే చాలా అరుదుగానే వాటిని ధరించినట్టు చెప్పింది. ఫంక్షన్లు, ఇంట్లో మాత్రమే వాటిని ధరిస్తానని, కానీ తనకు ఏదైనా కంఫర్ట్ గా ఉంటుందో అవే వేసుకుంటానని చెప్పింది నందిని రెడ్డి.
చిన్నప్పట్నుంచి బైక్ నడిపేదాన్ని అని, అందుకు కంఫర్ట్ కోసం కూడా ప్యాంట్ షర్ట్ వేసేదాన్ని అని చెప్పింది నందిని రెడ్డి. హెయిర్ కట్ చేసుకోవడం గురించి చెబుతూ, తన జుట్టు రింగులుగా ఉంటుందని, చిన్నప్పుడు అమ్మ దువ్వేసమయంలో చిక్కుతీస్తుంటే బాగా నొప్పిగా ఉండేది, దీంతో తానే కట్ చేసుకునేదట. అలా షార్ట్ హెయిర్‌కి అలవాటు పడ్డానని, అది తన కంఫర్ట్ అని చెప్పింది. మరోవైపు మ్యారేజ్ గురించి చెప్పింది నందిని రెడ్డి. ప్రేమ పెళ్లి గురించి అడగ్గా, తన జీవితంలోనూ లవ్ స్టోరీ ఉందని, జెఎన్‌యూలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని, కలిసి తిరిగామని చెప్పింది. లివింగ్ రిలేషన్‌లో ఉన్నామని చెప్పింది నందిని రెడ్డి.

ఇక మ్యారేజ్ గురించి చెబుతూ, చేసుకోవద్దని అనుకోలేదని, చేసుకోవాలనే ఫీలింగ్ కలగలేదని, ఏదీ ప్లాన్ చేయలేదని చెప్పింది. తనకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయని, కానీ తాను సినిమా రంగంలో ఉన్నాను, తనని అర్థం చేసుకునేవాళ్లు, తన టైమింగ్‌ని అర్థం చేసుకునే వాళ్లు కావాలని, అలాంటి వాళ్లు తనకు ఇండస్ట్రీలో తారసపడలేదని, బయటి వాళ్లు వచ్చినప్పుడు తనకు ఆసక్తిగా అనిపించలేదని చెప్పింది నందిని రెడ్డి. తన మొదటి సినిమాకి ఆరేళ్లు పట్టిందని, ఆ తర్వాత ఒకటి అర ఆఫర్లు వస్తుంటే వాటి చుట్టూ తిరిగానని తెలిపింది.
ఇలా టైమ్ గడిచిపోయిందని, పెళ్లి ఆలోచన రాలేదని చెప్పింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు ని చెప్పింది. నందిని రెడ్డి అలా మొదలైంది
సినిమాని నాని, నిత్యమీనన్ జంటగా రూపొందించింది. ఈ సరికొత్త లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మంచి ఆదరణ పొందింది. ఈ మూవీకి తనకు పది లక్షల చెక్ పారితోషికంగా ఇచ్చారని, దానితో అమ్మ చేసిన అప్పు తీర్చినట్టు తెలిపింది నందిని రెడ్డి. సినిమాల్లో రాకముందు రేడియో జాకీగానూ పనిచేశానని, 20వేల శాలరీ ఇచ్చేవారని తెలిపింది నందిని రెడ్డి.