పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడి పర్వత శిఖరాలపై వ్యూహాత్మక స్థానాలు ఆక్రమించారు. భారత సైన్యం ఈ స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ కీలక సమయంలో నానా పటేకర్ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుమతి లభించలేదు. కానీ సేవ చేయాలని పట్టుబట్టి ఫ్రంట్లైన్స్లో చేరారు. అయితే హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు నటుడు నానా పటేకర్.
హీరోగానే కాకుండా పాత్రకు తగినట్లుగా సహయ నటుడిగానూ కనిపించాడు. నానా పటేకర్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. 1990 తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు.

అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే ఆర్మీలో చేరేందుకు ఆయనకు అనుమతి వచ్చింది. అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ రెండువారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు. అక్కడ సైనికులకు సాయం చేశాడు… అలాగే బేస్ హాస్పిటల్లో పనిచేశాడు.
అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని… శ్రీనగర్ కు వెళ్లేటప్పుడు తాను 76 కిలోల బరువు ఉన్నానని.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో చెప్పుకొచ్చాడు. కార్గిల్ యుద్దం ముగిసిన తర్వాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు. సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధం చేసిన ఏకైక హీరో నానా పటేకర్.