Namitha: ఆ గుడిలోకి రావొద్దంటూ.. తెలుగు స్టార్ హీరోయిన్‌కు అవమానం.
Namitha: నేడు కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురయినట్లు స్వయంగా తన సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఎమోషనల్ వీడియో పోస్ట్ షేర్ చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నమితను అక్కడి అధికారులు తనను అడ్డుకున్నారని నమిత వీడియోను విడుదల చేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నమితకు కృష్ణాష్టమి రోజున చేధు సంఘటన ఎదురైంది.
Also Read: కర్నూలులో రైతుకు దొరికిన వజ్రం, రికార్డ్ ధరకు అమ్ముడైన వజ్రం.
నమితను, ఆమె కుటుంబ సభ్యులను మీనాక్షీ అమ్మవారి గుడిలోకి ప్రవేశించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఈమేరకు నమిత ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కృష్ణాష్టమి పండగ సందర్భంగా తన కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్లినట్లు నమిత తెలిపింది. అయితే అమ్మవారి గుడిలోపలికి వెళ్లకుండా తనను, తన ఫ్యామిలీని గుడి సిబ్బంది అడ్డకున్నారని, హిందూ కుల ధృవీకరణ పత్రం అడిగారని తెలిపింది.
Also Read: ఈ ఒక్క 1 రూపాయి నోటు మీ దగ్గర ఉంటే చాలు.
తనతో సిబ్బంది దరుసుగా మాట్లాడారని, అవి తననెంతో బాధించాయని నమిత తెలిపింది. అంతేకాకండా తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదని, వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు అని నమిత వీడియోలో పేర్కొంది. ఇక నమిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆలయ పరిపాలన సిబ్బంది వాళ్ల వెర్షన్‌ను చెప్పుకొచ్చారు.
Also Read: మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా సింపుల్ గా అప్‌డేట్ చేసుకోవచ్చు.
నమితతో ఎవరూ దురుసుగా వ్యవహరించలేదని, ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడామని తెలిపారు. అంతేకాకుండా పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పనట్లు, ఆ తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించినట్లు తెలిపారు.