విడాకుల బాటలో మరో స్టార్ హీరో, హీరోయిన్, ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్.

divyaamedia@gmail.com
1 Min Read

భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ – రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

అయితే నజ్రియా, ఫహద్ ఫాజిల్ ‘బెంగళూరు డేస్’ సినిమా షూటింగ్ లో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2014లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు మల్లూవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు త్వరలో వీళ్లిద్దరు విడాకుల తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా నజ్రియా చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. అందులో ఆమె గత కొంతకాలంగా తన భావోద్వేగ ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే ఆమె కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తన స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో కూడా సరైన కమ్యూనికేషన్‌లో ఉండలేకపోయానని ఆమె పేర్కొన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *