నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. తన తల్లి సీమా తన మొదటి భర్తతో విడాకులు తీసుకోని.. చందర్ సాధన అనే సినీ నిర్మాతను వివాహం చేసుకొన్నది. నగ్మాకు సినీ నటి జ్యోతిక, రోహిణి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వీరిద్దరూ కూడా తెలుగు, తమిళంలో నటించి మెప్పించారు. తండ్రి పోత్సాహం వల్లే సినిమా రంగంలోకి వచ్చారు. అయితే ఇతర రంగాలతో పోలిస్తే సినిమా సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది.
అదే సమయంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్ర రావు చెప్పినట్లు ‘అరేబియన్ గుర్రమంటి నలక నడుమున్న నగ్మా’ తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.
అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ లవ్‌లో పడిందని ప్రచారం సాగింది. అయితే ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటితో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది.
అయితే కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా సినిమాలకు దూరంగా ఉంటోన్న నగ్మా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలిగా ఉన్న ఆమె మీరట్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది.