వామ్మో.. అర్థరాత్రి అయితే నాగినిగా మారిపోతున్న భార్య, కతేస్తాను అంటూ భర్తను ఏం చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

భార్య రాత్రి సమయాల్లో పాముగా మారిపోయి, తనను కాటేయడానికి ప్రయత్నిస్తుందని యూపీకి చెందిన ఒక వ్యక్తి లబోదిబో మంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు దానిపై విచారణకు ఆదేశించారు. అయితే తన భార్య రాత్రివేళల్లో పాములా బుసలు కొడుతూ తనను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఫిర్యాదు చేశాడు.

నిద్రించేటప్పుడు మామూలుగానే పడుకుంటున్నా.. అర్థరాత్రి కాగానే ఒక్కసారిగా పాములా మారి తన వెంటపడుతూ కాటు వేయడానికి ప్రయత్నించిందని, తాను భయంతో నిద్ర కూడా పట్టకుండా గడుపుతున్నానని చెప్పాడు. ఆమె మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని చెప్పుకొచ్చాడు.. అయితే.. రాత్రిపూట తన పెళ్లాం పాములా మారి కాటేస్తోందని.. తాను స్థానిక పోలీసులను ఎన్నోసార్లు ఆశ్రయించినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, చివరికి జిల్లా అధికారుల సహాయాన్ని కోరాల్సి వచ్చిందని చెప్పాడు.

అయితే.. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌తో పాటు పోలీసులకు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ కేసు మానసిక వేధింపుల కోణంలోనూ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

బ్రో ఒక పనిచేయి.. నువ్వు కూడా కోబ్రాలా మారిపో సరిపోతుందంటూ కామెడీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది 1986లో వచ్చిన శ్రీదేవి నటించిన నాగిని సినిమాను ఉదహరిస్తూ చమత్కారాలు చేస్తున్నారు. అతను చాలా అదృష్టవంతుడు. తన భార్య శ్రీదేవిలా ఉంది అనే పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. మెరాజ్ జిల్లా అధికారులకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో తన భార్య ఇప్పటికే ఒకసారి నిజంగా అతనిని కరిచినట్లు, ప్రతి రాత్రి ఆమె పాముగా మారి తన వెంట పరిగెడుతుందని.. దానిలో స్పష్టంగా పేర్కొన్నాడు.

న్యాయపరంగా ఇది ఎంతవరకు నమ్మదగినదో అనేది అధికారుల విచారణ తరువాత స్పష్టమవుతుంది. అయితే మెరాజ్ చెప్పిన వాదన నిజమా? లేక ఇది మరొక మానసిక భ్రమా? అన్నదానిపై విచారణ జరపనున్నారు అధికారులు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *