Nagarjuna Amala | అమల నాగార్జున కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డరా..?

divyaamedia@gmail.com
3 Min Read

Nagarjuna Amala |టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున..అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్) నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున తనయులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. కాగా, నాగార్జున తన భార్య అమలతో పెళ్లికి ముందర పలు సినిమాల్లో ఆన్ స్క్రీన్ పెయిర్ గా పని చేశాడు. ఆ తర్వాత వారు ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్..అనగా రియల్ కపుల్ అయిపోయారు. నాగార్జున-అమల తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘కిరాయి దాదా’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

కాగా, నాగార్జున-అమలల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.ఇక ఆ తర్వాత మోహన్ గాంధీ దర్శకత్వంలో ‘చినబాబు’ అనే చిత్రంలో నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున-అమల జంటగా నటించిన ‘శివ’ ఫిల్మ్..ఇండస్ట్రీ హిట్ అయింది. ఇదిలా ఉంటే, హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ వీరిద్దరి వివాహం 1992 జూన్ 11న జరిగింది.

అంటే నాగార్జున-అమల వివాహబంధంలోకి అడుగుపెట్టి 32 సంవత్సరాలు కావొస్తుంది.అయితే, ఈ క్రమంలో గతంలో అమల వంటపై నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమల తండ్రి బెంగాలీ కాగా ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. అమల తల్లిదండ్రలు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఆయన నేవీ ఆఫీసర్ గా చేస్తున్న సమయంలో డిప్యూటేషన్ మీద ఖరగ్ పూర్ ఐఐటీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించారు. అమల తల్లి మైహౌ కూడా జాబ్ చేసేది. పెళ్లి తర్వాత వీరిద్దరూ చెన్నై మరియు వైజాగ్ వంటి ప్రదేశాల్లో చాలా కాలం ఉన్నారు.

Also read : సిఎం చంద్రబాబు సోదరుడు అనారోగ్యంతో మృతి

అయితే నాగార్జునకు ముందుగా దగ్గుబాటి వెంకటేష్ సోదరితో వివాహం జరిగింది. అమలను ప్రేమించిన వెంటనే భార్యతో విడాకులు తీసుకొని, అమలను వివాహం చేసుకున్నారు. అమల.. ‘బ్లూ క్రాస్’ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటూ గొప్ప మహిళగా పేరుతెచ్చుకుంది. నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమల పూర్తిగా హైదరాబాద్ వచ్చేశారు. వివాహం తర్వాత అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం లాంటి రెండు సినిమాల్లో నటించారు. అందులో పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు.

ఆ హీరోతో ప్రేమలో

అయితే అమల నాగార్జున కంటే ముందు ఓ హీరోను ప్రేమించారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళ హీరో కార్తీక్‌తో అమలా ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. హీరో కార్తీక్, అమల ఇద్దరు ప్రేమించుకున్నారని తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. వీరిద్దరు ‘ఘర్షణ’ అనే మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఎక్కువ మందికి తెలియదట.కేవలం అమల,కార్తిక్ దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత అమల తమిళ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఆమె తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *