నాగార్జునకు తెలియకుండా ఆ పని చేసిన అమల, దీంతో నాగార్జున ఏం చేసాడో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అక్కినేని అమల కెరీర్ పీక్స్ లో ఉండగానే టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు హీరోయిన్ గా పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన అమల పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బ్లూ క్రాస్ అనే జంతు సంరక్షణ సంస్థతో కలిసి పని చేస్తుంది అమల. అయితే అమల-నాగార్జున దంపతులకు అఖిల్ పుట్టాడు. అఖిల్ హీరోగా రాణిస్తున్న సంగతి సంగతి తెలిసిందే. అఖిల్ పసిప్రాయంలోనే సిసింద్రీ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఆ మూవీ భారీ విజయం సాధించింది. 2015లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన ఓ భారీ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

అఖిల్ కెరీర్ కోసం నాగార్జున, అమల గట్టి ప్రణాళికలే వేస్తున్నారు. ఇదిలా ఉంటే అమల జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడాను. రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్. నాగార్జున ఇంట్లో అనేక పెట్ డాగ్స్ ఉన్నాయి. వీటిలో లాబ్రాడర్ అనే కుక్క అంటే నాగార్జునకు అత్యంత ఇష్టం అట. అది నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటుందట. ఇంటికి రాగానే పరుగున నాగార్జున దగ్గరకు వెళ్లిపోతుందట. ఒకసారి అమల లాబ్రాడర్ ని ట్రైనింగ్ కి పంపిందట. ఈ విషయం నాగార్జునకు చెప్పలేదట. షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన నాగార్జునకు లాబ్రాడర్ కనిపించలేదట.

అది ఎక్కడని అమలను అడిగితే… ఒక నెల రోజులు ట్రైనింగ్ కి పంపానని చెప్పిందట. అది విని షాక్ అయిన నాగార్జున అమల మీద ఫైర్ అయ్యాడట. నాకు చెప్పకుండా లాబ్రాడర్ ని ఎందుకు ట్రైనింగ్ కి పంపావు అని కోప్పడ్డాడట. అమలతో నాగార్జున పది రోజులు మాట్లాడలేదట. తర్వాత లాబ్రాడర్ కి ట్రైనింగ్ ఇప్పించడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నారట. అప్పుడు అమలతో మాట్లాడారు అట. ఓ సందర్భంలో అమల ఈ విషయం చెప్పుకొచ్చింది. మరోవైపు నాగార్జున వరుస చిత్రాలతో ఫుల్ బిజీ. ఆయన జన్మదినం పురస్కరించుకుని రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

మాస్, ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక నాగార్జున పాత్ర పేరు సైమన్ గా పోస్టర్ లో తెలియజేశారు. కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ కూలీ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేర్చాయి. కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కుబేర మూవీలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. భవిష్యత్ లో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *