నాగ పంచమి రోజున మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే చాలు, మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.

divyaamedia@gmail.com
2 Min Read

నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిదిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు శివుడితో పాటు నాగేంద్రుడికి భక్తీ శ్రద్దలతో పూజలు చేస్తారు. ఈ రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడని.. అతని అనుగ్రహంతో సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని నమ్మకం. నాగ పంచమి రోజున శివుడిని పూజించడంతో పాటు నాగేంద్రుడిని పూజించే సంప్రదాయం కూడా ఉంది.

అందువల్ల నాగ పంచమి రోజున శివునితో పాటు నాగ దేవతను కూడా పూజిస్తారు. నాగ పంచమి రోజున జ్యోతిషశాస్త్రంలో కొన్ని చాలా సులభమైన, ప్రత్యేకమైన పరిహారాలు సూచించారు. ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతాడని నమ్మకం. ఎవరి జాతకంలోనైనా సరే కాల సర్ప యోగం లేదా పితృ దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ దోషాలు తొలగిపోవాలంటే నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్త పారాయణం చేయాలి. పితృ దోషం నుంచి బయటపడటానికి రెమెడీ..నాగ పంచమి రోజున శివుడికి చందనం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

అందుకే ఈ రోజున శివుడిని చందనాన్ని సమర్పించండి. అనంతరం ఆ తర్వాత చందనాన్ని నుదుట తిలకంగా దిద్దుకోండి. అంతేకాదు ఈ రోజున ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, శ్రీ మద్ భగవద పురాణాన్ని, శ్రీ హరివంశ పురాణాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఆర్ధిక ఇబ్బందులు తీరడానికి రెమెడీ..నాగ పంచమి రోజున వెండి లోహంతో చేసిన జంట సర్పాలను సుబ్రహ్మణ్య ఆలయానికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని నమ్ముతారు. బాధ నుండి ఉపశమనం పొందే మార్గాలు..నాగ పంచమి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడంతో పాటు సర్పానికి పాలు సమర్పించాలి.

నాగ పంచమి రోజున సూర్యాస్తమయం అయిన వెంటనే నాగదేవత పేరుతో దేవాలయాలు, ఇంటి మూలల్లో మట్టి దీపాలను వెలిగించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, దుఃఖాల నుండి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు. సంపదను పెంచుకోవడానికి రెమెడీ..నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ లేదా మట్టితో పాము చిత్రాన్ని గీయండి. దీని తరువాత ఆచారాలతో ఈ చిత్రాలను పూజించండి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *