టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంట్లో నడిరాత్రి అగంతకుల ప్రవేశం కలకలం రేపింది. నాలుగు మంది గుర్తు తెలియని వ్యక్తులు అభిమానులమని చెప్పుకుంటూ ఆయన నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇది నిజమైన అభిమానులు.. చర్య కాదు అని నటి అమల గట్టిగా స్పందించారు. అయితే అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదు. నిజంగానే వాళ్ళు అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు అట. ఎలా అయినా నాగార్జున ని కలవాలి అనే తాపత్రయం తో హద్దులు దాటి ఇలా ప్రయత్నం చేసారని అంటున్నారు విశ్లేషకులు.
అలా ప్రవర్తించడం తప్పు, అభిమాని అనే వాడు ఇలా చేయడు, మీరు ఫ్యాన్స్ అనే పదానికి అర్థం తీసేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఎంతో ప్రశాంతంగా కనిపించే అమల లో ఇంత ఫైర్ ఉందా అని ఈ వీడియో ని చూసిన అభిమానులు అంటున్నారు. అయితే ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి అంత దర్జాగా నాగార్జున ఇంట్లోకి ప్రవేశించాడంటే, సెక్యూరిటీ ఏ రేంజ్ లో నిద్ర పోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడంటే అభిమాని వచ్చాడు, రేపో ఎవరో ఒకరు నాగార్జున అంటే ఇష్టం లేని వ్యక్తులు లోపలకు ప్రవేశించి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. సెలబ్రిటీలకు సెక్యూరిటీ ఇంత పేలవంతంగా ఉండడం ఇది రెండవసారి. నిన్న కూడా రాజమండ్రి లో హీరో రామ్ బస చేస్తున్న హోటల్ లోకి ప్రవేశించి, రామ్ గది వరకు వెళ్లి తలుపు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు బాగా మద్యం సేవించినట్టు తెలిసింది. ఇలా ప్రముఖుల సెక్యూరిటీలు వైఫల్యం చెందుతుండడంతో అభిమానుల్లో కాస్త కంగారు మొదలైంది.
ఇకపోతే నాగార్జున రీసెంట్ గానే ‘కుబేర’ చిత్రంతో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగష్టు నెలలో ఆయన విలన్ గా నటించిన ‘కూలీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఎలాగో ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మన అందరికీ ప్రతీ వారం కనిపిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఈ ఏడాది నాగ నామసంవత్సరం అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.