బిగ్‌బాస్ షో నిర్వాహకులు, హోస్ట్ నటుడు నాగార్జునపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సమాజం సిగ్గుపడే విధంగా అభ్యంతరకర కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, నైతిక విలువలు లేని వ్యక్తులను మాత్రమే కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేస్తున్నారని వారు ఆరోపించారు.
దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి కంటెస్టెంట్‌ల ఎంపిక ద్వారా కార్యక్రమం ఎలాంటి సందేశాన్ని ఇస్తోందని ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ షో పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో.. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవపట్టిస్తుందని.. బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని వారు ఆరోపించారు.
అదేవిధంగా కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుంటున్న బిగ్ బాస్ టీం.. సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు.. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. “బిగ్ బాస్ షో పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాము. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలి.
నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యాలి. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది” అని పలువురు యువకులు ప్రశ్నిస్తున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇప్పటికే 39 రోజులు అవుతుంది. కొందరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చేశారు.
