ఆముదం.. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని జుట్టుకి ఎక్కువగా వాడతారు. కానీ, ఈ ఆముదం రాయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా నాభికి రాయడం వల్ల ముఖ్య లాభాలున్నాయి. ఈ ఆయిల్‌ని నాభిపై అప్లై చేయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే నాభికి ఆముదం నూనెను పూస్తే అది ఒకేసారి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఇది జుట్టు పెరుగుదలకు, చర్మంలో యవ్వనానికి దారితీస్తుంది. అదే సమయంలో కడుపును శుభ్రపరచడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నాభికి ఆముదం నూనె పూయడం వల్ల మలబద్ధకం అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ నాభికి ఒక చుక్క ఆముదం నూనె రాయడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
స్త్రీల ఋతు చక్రంలో వచ్చే ఋతు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఆముదం ఒక అద్భుతమైన గృహ నివారణ. ప్రతిరోజూ నాభిపై ఒక చుక్క ఆముదం నూనె వేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఆముదం కూడా ఒక అద్భుతమైన నివారణ. నాభికి ఆముదం రాయటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను కూడా నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
సంతానం విషయంలో కూడ ఆముదం ఎంతో మేలు చేస్తుంది. నాభికి ఆముదాన్ని రాయడం వల్ల అందులోని ఔషధ గుణాల కారణంగా ఫెర్టిలిటీ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు సర్క్యూలేషన్‌ని పెంచుతుంది. రీ ప్రోడిక్టివ్ ఆర్గాన్స్ సరిగా పనిచేస్తాయని, ఫెర్టిలిటీ సమస్యలు దూరమవుతాయని అంటున్నారు.