అమ్మాయిగా మారాలని ప్రైవేటు పార్ట్ కోసేసుకున్నాడు, చివరికి ఏం జరిగిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అమేధీకి చెందిన యువకుడు.. పోటీ పరీక్షలకు చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటాని పెద్దలకు చెప్పి ప్రయాగరాజ్ కు వచ్చాడు. అక్కడే ఓ గది తీసుకుని క్లాసులకు వెళ్తున్నాడు. కానీ వచ్చినప్పటి నుండి అతను క్లాసుల కన్నా.. తాను అమ్మాయిగా మారాలన్న ఆలోచనతోనే ఉండేవాడు. 14 ఏళ్ల వయస్సు నుంచే తనను తాను ఒక అమ్మాయి అనిపించడం మొదలైందని, కానీ తల్లిదండ్రుల ఏకైక కుమారుడిగా ఉండటం వల్ల ఈ భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయానని బాధపడేవాడు.

పూర్తీ వివరాలోకి వెళ్తే ప్రయాగ్‌రాజ్‌లో ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారాలని అనుకోవడం మామూలే కానీ.. దాని కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి, తన ప్రైవేట్ భాగాన్ని తానే కోసుకోవడం షాకింగ్. ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువకుడు ఎవరి సహాయం లేకుండా ఒక నకిలీ డాక్టర్ చెప్పిన మాటలు విని, మెడికల్ షాపులో ఇంజెక్షన్లు, బ్లేడ్ కొనుక్కున్నాడు.

తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఈ సెల్ఫ్ సర్జరీ చేసుకున్నాడు. ఇంజెక్షన్ ప్రభావం ఉన్నంత సేపు బానే ఉన్నా.. అది తగ్గిన తర్వాత నొప్పి తట్టుకోలేక విలవిలలాడిపోయాడు. రక్తం కారిపోవడంతో ప్రాణాల మీదకు వచ్చింది. చిన్నప్పటి నుంచే.. ఆ యువకుడు తాను అబ్బాయిని కాదని, అమ్మాయిని అని చిన్నప్పటి నుంచే భావించేవాడు. దాదాపు 14 సంవత్సరాల వయస్సు నుండి అతనిలో ఈ ఆలోచనలు మొదలయ్యాయి. కానీ తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు.

అమేథీ జిల్లాకు చెందిన ఈ యువకుడు.. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు కావడంతో ఒత్తిడికి లోనై ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. నొప్పితో విలవిల..కాగా అనస్థీషియా ప్రభావం ఉన్నంత వరకు అంతా బాగానే ఉన్నా, దాని ప్రభావం తగ్గిపోగానే తీవ్రమైన నొప్పి మొదలవడంతో యువకుడు విలవిలలాడిపోయాడు. గంటసేపు నొప్పిని భరించిన తర్వాత, రక్తం ఎక్కువగా పోవడంతో, చివరికి ఇంటి యజమానికి విషయం చెప్పాడు.

ఇంటి యజమాని వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, అతడిని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఒక రకమైన జెండర్ వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్నవాళ్లు తమ శరీరానికి, తమ మనసులోని జెండర్‌కు సంబంధం లేదని భావిస్తారు. సరైన వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అదృష్టవశాత్తు ఇంటి యజమాని అతన్ని సరైన సమయంలో హాస్పిటల్‌లో చేర్చడం వల్ల ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు అతనికి మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో నకిలీ వైద్యులను నమ్మకుండా, సరైన నిపుణులను సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *