ముమైత్ ఖాన్.. తన హుషారెత్తించే స్టెప్పులతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. పోకిరిలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్. ఆ తర్వాత ప్రభాస్ యోగి సినిమాలో ‘ఓరోరి యోగి’, రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి’, వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీమశాస్త్రి’, ‘మగధీర’, నేనింతే, బుజ్జిగాడు, ఇలా కేవలం 4 ఏళ్లలోనే ఏకంగా 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.
అయితే ఇండస్ట్రీలో నలుగురితో ప్రేమలో పడ్డాను అని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది.
హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. గతంలో ఓ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది. తాజాగా ముమైత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ముమైత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆ మధ్య తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని తెలిపింది. ఆతర్వాత కోలుకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో నలుగురితో డేటింగ్ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్ కాకపోవడంతో బ్రేకప్ చెప్పానని తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి రాసి ఉంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.
