ఈ మూగ జీవాలకు ఆహారం అందిస్తే.. జీవితంలో కష్టాలన్నీ, అప్పులన్నీ తొందరలోనే తిరిపోతాయ్..!

divyaamedia@gmail.com
2 Min Read

జీవఆవిర్భావం జరిగినప్పటి నుంచి జంతువులతో మనుషులకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన జీవితాల్లో భాగమైపోయాయి. ప్రతి పనిలో మనిషికి సహాయంగా ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని చూపుతూనే ఉన్నాయి. అయితే పక్షులు.. కొన్ని రకాల పక్షులు ఇంటి ఆవరణలో సందడి చేయడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాదు.. మంచిది కూడా.. పక్షులకు నీటిని పెట్టడం, తినడానికి చిరు ధాన్యం గింజలు అందించడం వలన స్టూడెంట్స్ కు మేలు జరుగుతుంది.

ఉద్యోగం కోసం చూసే వారికి కెరీర్ కి సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల కోసం చూస్తున్న భార్యాభర్తలు పక్షులకు ఆహారం అందించడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటికి సమీపంలో పక్షుల కోసం నీళ్లు, ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. చీమలు.. ఎవరైనా రాహు దోషంతో ఇబ్బంది పడుతుంటే.. చీమలకు ఆహారం పెట్టడం వలన రాహు అనుగ్రహం కలిగి .. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

ముఖ్యంగా నల్ల చీమలకు చక్కరని ఆహారంగా ఇవడం వలన కోరిక కోర్కెలు తీరతాయని విశ్వాసం. ఇంట్లో నల్ల చీమలు తిరగడం శుభప్రదం అని విశ్వాసం. కుక్కలు.. కాలభైరవుడిగా భావించి కుక్కలను పూజిస్తారు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన శనీశ్వరుడు, రాహు, కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం కుక్కకు ఆహారాన్ని పెట్టడం వలన శని అనుగ్రహం లభిస్తుంది.. శని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు, చేపలను కొంత మంది జలపుష్పాలు అని కూడా అంటారు.

ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా శత్రు భయంతో ఉన్నా, కష్టాలతో ఇబ్బంది పడుతున్నా చేపలకు ఆహారం అందించడం వలన మేలు జరుగుతుంది. అప్పులు తీరక ఇబ్బంది పడేవారు.. ఆర్ధిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా… గోధుమ పిండితో చేసిన ఉండలు, మొక్క జొన్న తో చేసిన పాప్ కార్న్ ని చేపలకు ఆహారంగా అందించడం వలన ఫలితం లభిస్తుంది నమ్మకం. ఇంట్లో అక్వేరియం ఉంటే చేపలకు ఆహారం అందించడం మంచిది.

ఆవు.. హిందువులు ఆవుని గోమాత అని పిలుస్తారు. దైవంతో సమానంగా భావించి పూజిస్తారు. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటాయని.. సమస్త జీవ రాశికి తల్లి అని నమ్మకం. అందుకనే చాలా మంది ఆవుని రోజూ పుజిస్తారు. అంతేకాదు ఎవరినా జాతకంలో గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతుంటే ఆవుకి ఆహారాన్ని అందిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. అంతేకాదు సంతానం కోసం చూసే దంపతులు అవుకు పచ్చ గడ్డి, గోధుమ పిండితో చేసిన రొట్టెలు, బెల్లం తినిపించడం వలన పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *