త‌ల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు. అమ్మ రుణం ఇలా తీర్చుకుని..! వైరల్ వీడియో

divyaamedia@gmail.com
2 Min Read

చిన్న‌త‌నంలోనే భ‌ర్త‌ను కోల్పోయిన త‌ల్లికి మ‌ళ్లీ ప్రేమ‌, కొత్త జీవితాన్ని అందించాల‌నుకున్నాడు. త‌ల్లిని వేరే వ్య‌క్తితో రెండో పెళ్లికి ఒప్పించాడు. తాజాగా బంధుమిత్రుల స‌మ‌క్షంలో ద‌గ్గ‌రుండి అహ‌ద్ త‌న త‌ల్లి నిఖా జ‌రిపించాడు. ఈ వివాహ వేడుక తాలూకు వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. అయితే తన తల్లికి రెండో వివాహానికి ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

దాయాది దేశం పాకిస్తాన్ లో అబ్దుల్ అనే యువకుడు.. తన తల్లి కళ్లలో ఆనందం చూసేందుకు ఇతరులకు భిన్నంగా ఆలోచించాడు. తన తల్లికి రెండో పెళ్లి చేయించిన అబ్దుల్.. తాను ఎందుకు ఈ పెళ్లి చేయించాల్సి వచ్చిందో తెలియజేస్తూ ఓ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 18 ఏళ్ల అబ్దుల్ అహ్మద్ అనే యువకుడు తన కన్న తల్లి ఋణం తీర్చుకోవడానికి ఆమెకు మళ్ళీ అందమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంటుందంటూ రెండో పెళ్లి చేయించాడు.

కొడుకు ముందుండి మరీ తన తల్లికి రెండో పెళ్లి చేయించాడనే అనే వార్త చర్చనీయాంశంగా మారింది. తన తల్లి రెండో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర వివరాలను అబ్దుల్ స్వయంగా ఓ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ వీడియోలో తన తల్లికి ఎందుకు రెండో పెళ్లి చేయించాలని నిర్ణయం తీసుకున్నాడో తెలియజేసే ప్రయత్నం చేశాడు. అబ్దుల్ తల్లికి చిన్నతనంలోనే పెళ్లి అయ్యింది. కూతురు కొడుకు పుట్టిన తర్వాత భర్త మరణించాడు. అప్పటి నుంచి ఆ పిల్లలకు తల్లీ తండ్రి అన్నీ తానై పెంచి పెద్ద చేసింది.

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా సరే పిల్లలకు ఎటువంటి లోటు తెలియకుండా పెంచింది. చదివించింది. తల్లి కష్టం చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలతో జీవితంలో సెటిల్ అయ్యారు. అయితే తన కోసం నిస్వార్థంగా జీవించిన తమ తల్లికి తన జీవితంలో మళ్ళీ ప్రేమని పొందే హక్కు ఉందని అబ్దుల్ తన తల్లిని పెళ్లి విషయంలో ఒప్పించి పెద్దల సమక్షంలో మరో వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *