ఒకప్పుడు దోమలు తేమ వాతావరణ పరిస్థితుల్లోనే ఎక్కువగా వృద్ధి చెందేవి. కానీ ఇప్పుడు సీజన్లతో సంబంధం లేకుండా వీటి వ్యాప్తి పెరుగుతోంది. అలాగే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొంత వరకు దోమల సమస్యను తగ్గించుకోవచ్చు. సాధారణంగా వీటి నివారణకు మస్కిటో కాయిల్స్, రిఫెలెంట్స్, స్ప్రేయింగ్ కెమికల్స్ వంటివి వాడతారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ అనారోగ్యాలకు దారితీస్తాయి. అయితే మనకు సహజంగా లభించే కొన్ని పదార్థాలతో దోమలకు చెక్ పెట్టవచ్చు.
కొన్ని రకాల నేచురల్ ప్రొడక్ట్స్‌తో మంచి ఫలితాలు ఎంటాయి. వీటిని మీరు కూడా ప్రయత్నించి చూడండి. అయితే దోమలు కుట్టడానికి ప్రధాన కారణం మనం ధరించే బట్టలు, ఎందుకంటే, దోమలు లేత రంగుల కంటే ముదురు రంగు దుస్తులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అలాగే హాఫ్ స్లీవ్ బట్టలు, పొట్టి బట్టలు ధరించడం వల్ల కూడా దోమలు కుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఏడిస్ దోమ కాళ్లను కాకుండా చేతులను ఎక్కువగా కుడుతుందట.
ఇక, మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ జాతికి చెందిన దోమలు కాళ్లపై కుట్టడానికి ఇష్టపడతాయి. కాబట్టి, వర్షాకాలంలో ఫ్లూ అంటువ్యాధుల సమయంలో పూర్తిగా దుస్తులు ధరించడం మంచిది. అలాగే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల బారిన పడకుండా ఉంటారు. ఇకపోతే, దోమలు ఎక్కువగా కుట్టడానికి మరో ముఖ్య కారణం కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా కుడుతుంటాయిని నిపుణులు చెబుతున్నారు.
ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తారని నిపుణులు అంటున్నారు. ఇక, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. అలాగే, చెమట పెరుగుతుంది. ఈ కారకాలన్నీ ఆడ దోమలకు అత్యంత ఆకర్షణీయంగా పనిచేస్తాయని చెబుతున్నారు.