ఈ తేనెకళ్ల అమ్మాయి హీరోయిన్‌గా నటించబోతున్న సినిమా ఏంటో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

మోనాలీసాకు తన సినిమాలో ఛాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికన ప్రకటించారు. మోనాలీసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలన్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నెటిజన్లను ప్రశ్నించారు సరోజ్. అయితే కుంభమేళలో.. ప్రయాగ్ రాజ్ లో ఐఐటీ బాబా, గ్లామరస్ సాధ్వీ హర్షరిచారియా, రష్యన్ కు చెందిన బాహుబలి బాబా, ఛోటు బాబా లు వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా కుంభమేళలో తేనె కళ్ల అమ్మాయి.. మోనాలీసా ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు.

ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం అనేక మీడియాలు, యూట్యూబ్ ఛానెల్స్ పొటీపడ్డాయి. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కుచెందిన మోనాలీసా కుటుంబం కుంభమేళలో.. మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ.. పొట్టకూటి కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను కొంత మంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఓవర్ నైత్ లో సోషల్ క్వీన్ గా మారిపోయింది. ఆమెతో ఫోటో దిగేందుకు కుంభమేళలో జనాలు క్యూలు కట్టారు.

ఇదిలా ఉండగా.. వైరల్ గర్ల్ మోనాలీసాలకు మూవీస్ లో అవకాశం ఇచ్చేందుకు… బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ముందుకు వచ్చారు. ఆమె ఎంతో నేచురల్ గా ఉన్నారని.. తన తదుపరి మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ ఆమెకు నటన రాకుంటే.. ట్రైనింగ్ ఇప్పించి మరీ ఆమెతో చేయిస్తానని కూడా డైరెక్టర్ క్లారీటీ ఇచ్చారు. ఈక్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తన తర్వాతి సినిమా అయినా “డైరీ ఆఫ్ మణిపూర్”లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు.

ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నట్లు వెల్లడించారు. తను డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిగా మోనాలీసాను ఎంపిక చేసినట్లు చెప్పారు. . అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్లి ఆమెను కలుస్తానని.. సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకుంటే.. ఆ తర్వాత ముందుకు వెళ్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *