బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆమెతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం పేరు ది డెయిరీ ఆఫ్ మణిపుర్. ప్రస్తుతం సనోజ్ మిశ్రా వద్దే మోనాలిసా యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటోంది. అయితే ఆయన మోనాలిసాతో చనువుగా వ్యవహరించడంపై పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా మోనాలిసా పేరు మార్మోగిపోయింది. దీంతో ఆమెకు సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు.
దీనికి సంబంధించి ఆమె స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేరళ వెళ్లడం, అక్కడ ప్రముఖ వ్యాపార వేత్త బాబీ చెమ్మనూర్ ఈవెంట్ కు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాతో చనువుగా ఉండడంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా ఈ వ్యాఖ్యల పై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనపై చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన వారిపై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ‘తప్పుడు వ్యాఖ్యలతో నా గౌరవాన్ని దిగజారుస్తున్నారు. మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారు. అందుకే ఇలా పోలీసులను ఆశ్రయిస్తున్నాను’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సనోజ్ మిశ్రా. సనోజ్ మిశ్రా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అంబోలీ స్టేషన్ పోలీసులు ఐదుగురిపై FIR నమోదు చేశారు.
పోలీసులు FIR నమోదు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్, వాసిమ్ రజ్వీ, రవి సుధా చౌదరీ, మహీ ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయా ఉన్నారు. కాగా మోనాలిసా మొదటి సినిమాలోనే గందరగోళ పరిస్థితులు, అసలు ఆమె జీవితంలో ఏదో జరుగుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
वसीम रिज़वी और उनके खरीदे हैं गुर्गों पर आज मैंने पुलिस में प्राथमिकी दर्ज कराई है, चंद पैसों और शोहरत के लिए मोनालिसा के भविष्य के साथ खिलवाड करने वाले गैंग की सच्चाई जल्दी ही लोगों के सामने आयेगी pic.twitter.com/4tHFAZgwZ5
— Sanoj Mishra (Film director Modi ka pariwar) (@SanojMishra12) February 21, 2025