కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే తేనెకళ్ల సుందరి మోనాలిసాకి సినిమా ఆఫర్. ఆ స్టార్ హీరో ఎవరంటే..!

divyaamedia@gmail.com
1 Min Read

కుంభమేళలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసాపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇండోర్ కు చెందిన మోనాలిసా కుటుంబం పూసలమ్ముకుని జీవనం సాగిస్తుంది. మోనాలిసా చూడచక్కని కళ్లు, మోముపై చిరునవ్వు కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది. అయితే ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు.. చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది.

ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మోనాలిసా.. చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట.

డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం.. ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యాయని.. తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని.. ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని.. త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు.

మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *