మహాకుంభమేళాలో చూపు తిప్పుకోలేని అందంతో ఉన్న మోనాలిసా బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఎలాంటి మేకప్ లేకుండా సహజసిద్ధమైన అందంతో మెరిసిపోయేవారు కనిపిస్తే ఓపట్టాను చూపు తిప్పుకోలేము. దీనికి తోడు ముఖంపై ఇదీ అని స్పష్టంగా చెప్పలేని అందమైన భావాలు తొణికిసలాడితే ఇక ఆ అందాన్ని వర్ణించడం మాటలకు అసాధ్యం. ఇప్పుడిదంతా ఎందుకంటే కుంభమేళాలో ఓ యువతి సహజసిద్ధమైన సౌందర్యం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎవరీ నేచురల్ బ్యూటీ అంటూ ఆమెను తెగ పొడిడేస్తున్న జనాలు యువతిని కుంభమేళా మోనాలిసా అని కూడా పిలుస్తున్నారు. అయితే ఇంతలా పొగుడుతోంది ఏ సినిమా హీరోయిన్ గురించో, మోడల్ గురించో కాదు… రోడ్డుపై రుద్రాక్ష, ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి.

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతినిండా వివిధ రకాల మాలలను (రుద్రాక్ష, ముత్యాలతో చేసినవి) వేసుకుని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తున్న ఆ అమ్మాయి అందానికి ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. చిత్రవిచిత్రమైన బాబాలు, నాగసాధువులు, తపోశక్తి కలిగిన మునులు, కాషాయం కట్టిన సన్యాసులు… ఇలా ఎంతోమంది ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపిస్తున్నారు. కానీ అందరికంటే ఈ మాలలమ్మే అమ్మాయే ఎక్కువ ఫేమస్ అయ్యింది.

ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు… ఆమె వీడియోలతో రీల్స్ చేస్తున్నారు. ప్రజలకు కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంటోంది… అందువల్లే ఇలా ఈమె వీడియో పెట్టగానే అలా మిలియన్స్ వీవ్స్, వేల కామెంట్స్ వస్తున్నాయి. పిల్లి కళ్లు, ముక్కుకు పుడక, అందమైన నవ్వు… ఈ సహజ సౌందర్యానికే ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇలా ప్రయాగరాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే… ఆమె పేరు మోనాలిసా భోంస్లే.

ఆమె స్వస్థలం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్. అక్కడినుండి కుటుంబసభ్యులతో కలిసి ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చింది. మోనాలిసాది నిరుపేద కుటుంబం. తండ్రితో పాటు కుటుంబసభ్యులంతా రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఎక్కడ కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతుంటారు. మరీముఖ్యంగా సన్యాసులు, సాధుసంతులు ఎక్కువగా హారజయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా వుంటుంది.

ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ మోనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది… ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. పేరుకు తగ్గ అందం ఆమెదంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *