కుంభమేళలో పూసలమ్మే మోనాలిసాపై దాష్టీకంగా వ్యవహరించారు. కుంభమేళ కంటే ఇప్పుడు మోనాలిసాపైనే జనాలు ఫోకస్ చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది కొందరి భక్తుల తీరు. అయితే ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సోషల్ మీడియాకెక్కిన దండలు విక్రయించే యువతి మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌లోని ఇంటికి పంపించేశాడు. ఇంటర్నెట్‌లో ఆమెకు పేరు ప్రఖ్యాతులు లభించి వైరల్ అయిన తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం, వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతుండటంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇండోర్ ‘మోనాలిసా’ తిరిగి ఇంటికి చేరుకుందని పేర్కొన్నాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ, ఎక్కువమంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. నెటిజన్లు ముద్దుగా ‘బ్రౌన్ బ్యూటీ’గా పిలుచుకుంటున్న మోనాలిసా భోస్లే తన అమాయకపు చూపు, ముగ్ధమనోహరమైన రూపంతో ఇంటర్నెట్‌ను కట్టిపడేసింది.
నీలి రంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. అది ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్‌లో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. అయితే, అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళాకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
కుంభమేళలో పూసలమ్మే మోనాలిసాపై దాష్టీకం
— Pulse News (@PulseNewsTelugu) January 21, 2025
కుంభమేళ కంటే ఇప్పుడు మోనాలిసాపైనే జనాలు ఫోకస్
కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారిన కొందరి భక్తుల తీరు
ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్న యువకులు
యువతిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న ఫ్యామిలీ
ఆమె ఫోటోలు వైరల్ చేసిన… pic.twitter.com/SNyg6urAQo