1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ 1978లో ‘తిరనోత్తం’ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. 360కి పైగా చిత్రాలతో, ఆయన ‘కిరీడం’, ‘భారతం’, ‘వానప్రస్థం’, ‘పులిమురుగన్’, ‘దృశ్యం’ సిరీస్ వంటి క్లాసిక్‌లను అందించారు. ఆయన ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్‌లను అందుకున్నారు.
అయితే మనకు మెగాస్టార్ చిరంజీవి ఎలాగనో మళయాలంలో మోహన్ లాల్ అలాగా. అక్కడ మంచి పేరుంది మోహన్ లాల్ కి. ఆయన అంటే ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. నిజానికి మోహన్ లాల్ సూపర్ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ నేను ఇలాంటి సినిమాలోనే నటించాలి..నా పాత్ర ఇలాగే ఉండాలి అని గిరి గీసుకోకుండా .. కథ కే అధిక ప్రాధాన్యత ఇస్తూ..

సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే..ఆయన ఆ కధలో ఇంపార్ టెంట్ అయితే మాత్రం అలాంటి సినిమాలకు సైన్ చేసేస్తాడు. అయితే తాజాగా మోహన్ లాల్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు రూ.427.5 కోట్ల వరకు ఉంటుంది.
అలాగే ఆయన రెస్టారెంట్ బిజినెస్ లో రాణిస్తున్నారు. చెన్నై, కొచ్చిలోని ఓ ఆసుపత్రి, సినిమా థియేటర్ వంటి అనేక వాటిలో పెట్టుబడులు పెట్టారు. కొచ్చిలో 9,000 చదరపు అడుగుల విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కలిగి ఉన్నారు. మోహన్ లాల్ వద్ద రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ SLS AMG, పోర్స్చే కయెన్, BMW X5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.