ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా వినూత్న పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా బీమా సఖి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఎల్‌ఐసీలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీమా సఖీ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా అవకాశం కల్పించనుంది. ఈ పథకంలో భాగంగా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరే మహిళలకు మూడేళ్ల పాటు స్ట్రైఫండ్‌తో కూడిన ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసుకోవచ్చు.
అర్హతలు ఇవే.. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి -మూడేళ్లు స్ట్రైఫండ్ పొందవచ్చు -సాధారణ ఏజెంట్ అయ్యాక కమిషన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి -కనీసం పదో తరగతి ఉత్తీర్హత సాధించి ఉండాలి -తొలి ఏడాది ప్రతీ నెలా రూ.7 వేల స్ట్రైఫండ్ -రెండో నెలలో రూ.6 వేల స్ట్రైఫండ్ -మూడో ఏడాదిలో రూ.5 వేల స్ట్రైఫండ్ ఉంటుంది -డిగ్రీ పూర్తి చేసినవారికి ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం. కమిషన్ ఎలా ఉంటుంది..పాలసీలపై ఆధారపడ కమిషన్ అనేది అందిస్తారు. మొదటి 4 నెలల్లో నెలకు రూ.2 వేల వరకు కమిషన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే 4 నెలల్లో నెలకు రూ.4 వేల వరకు కమిషన్ అందుకోవచ్చు.
ఇక చివరి 4 నెలల్లో రూ.6 వేల చొప్పున అందుకోవచ్చు. పాలసీను బట్టి ఏడాదికి రూ.48 వేల వరకు కమిషన్ వస్తుంది. నిబంధనలు ఇవే.. ఇప్పటికే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేసే మహిళలకు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు. కొత్తగా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకునే మహిళలు మాత్రమే అర్హులు. ఇక ఏజెంట్ల బంధువులు, మాజీ ఎల్‌ఐసీ ఏజెంట్లు కూడా ఈ పథకంలో చేరడానికి అనర్హులు. అప్లై చేసుకోవడం ఎలా.. ఈ పథకం కింద ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకునే మహిళలు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలన్నీ పూర్తి చేసి వయస్సు, విద్యార్హత, అడ్రస్ వంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వాటిని ఎల్‌ఐసీ అధికారులు పరిశీలించి ఆ తర్వాత మహిళలకు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా అవకాశం కల్పిస్తారు. గతంలో మహిళలు ఏజెంట్లుగా చేరితే పురుషుల్లాగే కమిషన్ బేస్డ్ ఇన్‌సెంటివ్స్ ఉండేవి. ఇప్పుడు ఈ పథకం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు నెలనెలా స్ట్రైఫండ్ కూడా ఇవ్వనున్నారు. బీమా రంగంలో ఏదగాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
