ప్రధాని మోదీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. ఇక ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ప్రధాని ఏదైనా పోస్ట్ పెట్టారంటే చాలు.. అది కోట్లల్లో లైక్‌లు, షేర్లు, కామెంట్లతో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబార్లు ఉన్న రాజకీయ నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
ఆయనకంటూ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ప్రసారమవుతాయి. మరి ఈ ఛానెల్‌కు ఎంతమంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రధాని మోదీకి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాతో సహా వివిధ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆయనకు ఓ అధికారిక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.
ఈ ఛానల్ 2007 అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించారు. ఈ ఛానెల్‌కు 26 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఇప్పటివరకు 29,272 వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఇక ఆ వీడియోలకు మొత్తం 636 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఈ ఛానెల్ ద్వారా ప్రధాని మోదీకి నెలకు రూ. 1.62 కోట్ల నుంచి రూ. 4.88 కోట్ల ఆదాయం వస్తోందట.