మోడీ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తోంది, వడ్డీ లేకుండానే రూ. 5 లక్షలు..!

divyaamedia@gmail.com
2 Min Read

ప్రధాని మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మంది వ్యాపారాల కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. ముందుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత కట్టే విధానం బ్యాంకులు అవలంభిస్తున్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలులోకి తెస్తోంది. ఎన్నో పథకాలు చిన్న వ్యాపారాల కోసం రుణాలు ఇచ్చేందుకు కేటాయించారు. అలాగే మోడీ ప్రభుత్వం క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెడుతోంది.

బ్యాంకులు ఎలా అయితే ముందస్తు ఖర్చులకు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తాయో.. అలాగే మోడీ ప్రభుత్వం కూడా క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎంతో మంది వ్యాపారులకు మేలు జరగబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సమర్పించారు. అలా బడ్జెట్ ను సమర్పిస్తున్నప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి కలిగిన క్రెడిట్ కార్డులను ప్రవేశపెడతామని ఆమె చెప్పారు.

Udyam పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఆమె చెప్పారు. మొదటి ఏడాదిలో పది లక్షల కార్డులు జారీ చేస్తామని వివరించారు. భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ క్రెడిట్ కార్డులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో వ్యాపారం మొదలుపెట్టిన వారికి ఈ రుణాలను అందించే క్రెడిట్ కార్డులను అందజేస్తారు.

అంటే సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థలకు లేదా మధ్యతరహా పరిశ్రమలకు ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తారు. ఈ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయి. పరికరాలు, వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు సాయంతో కొనవచ్చు. అలా వ్యాపార ఖర్చులను తీర్చుకున్నాక వచ్చిన లాభంతో తిరిగి ప్రభుత్వానికి చెల్లించవచ్చు. ఈ కార్డులు వ్యాపార ఖర్చులను ట్రాక్ చేయడానికి కూడా సహాయపడతాయి. తద్వారా ఖర్చులను నియంత్రిస్తాయి.

ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డుల మాదిరిగానే రివార్డులను, క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు తీసుకోవచ్చు. తిరిగి చెల్లించడం వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ క్రెడిట్ కార్డును వాడిన తర్వాత.. చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా మారుతుంది. ఈ క్రెడిట్ కార్డులు ద్వారా డబ్బును వాడిన తర్వాత తిరిగి చెల్లించేందుకు 45 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేకుండానే కాలపరిమితిని అందిస్తుంది.

వ్యాపారాలకు స్వల్ప కాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి ఈ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ క్రెడిట్ కార్డుల కోసం SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్ ఇలా కొన్ని బ్యాంకులతో అనుసంధానమయ్యింది కేంద్ర ప్రభుత్వం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *