మీరు ఏ సమయాలల్లో పాలు తాగితే మంచిదో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమైన నూట్రియెంట్స్ మిల్క్‌లో ఉంటాయి. అందుకే పిల్లలు, పెద్దవాళ్లు రోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఏ సమయంలో తాగాలనేది చాలా మందికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. సాధారణంగా ఉదయం లేదా రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు. ఇందుకు సరైన సమయం ఏంటనేది స్పష్టంగా చెప్పలేం. అయితే పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇకపోతే పాలను ఉదయం తాగాలా; రాత్రి తాగాలా? అనేది మీ ఇష్టం.

అయితే పాలను ఎప్పుడు తాగాలో అనే అయోమయంలో ఉంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. చాలా మంది ఉదయాన్నే పాలను తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో జీర్ణక్రియ మెరుగుపడటం ఒకటి. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే బలహీనమైన ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కండరాలు దృఢంగా మారుస్తుంది. కాబట్టి మీరు ఉదయాన్నే పాలను తాగినా బోలెడు లాభాలను పొందుతారు.

కొందరికి ఉదయాన్నే పాలను తాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా లాక్టో అసహనం ఉన్నవారికి. వీళ్లు ఉదయాన్నే పాలను తాగితే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పరిగడుపున పాలను తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ, కడుపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. పరిగడుపున పాలను తాగే అలవాటు ఉంటే వేడి పాలకు బదులుగా చల్లని పాలను తాగండి. చల్ల పాలను తాగితే కడుపులో ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొవ్వు తక్కువగా ఉండే పాలనే తాగాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు లేదా గుండె సమస్యలు ఉన్నవారు పరిగడుపున పాలను తాగకూడదు. అయితే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే బాగా నిద్ర పడుతుంది. అలాగే వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *