చివరిరోజు మెస్సీ పాల్గొన్న ఢిల్లీ ఢిల్లీ కార్యక్రమాల్లో ‘మీట్, గ్రీట్’ కూడా ఒకటి. ఈ ఈవెంట్‌లో మెస్సీని కలిసి అతడితో కరచాలనం చేసేందుకు కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, వీఐపీలు రూ. కోటి చెల్లించినట్టు సమాచారం. ఈ కార్యక్రమం స్థానిక లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అయితే కోల్‌కతా, హైదరాబాద్‌లో ఈ ‘మీట్, గ్రీట్‘ ఈవెంట్‌కు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలే చార్జ్ చేయడం గమనార్హం.
అయితే లియోనెల్ మెస్సీ శనివారం భారతదేశానికి ప్రత్యేక మూడు రోజుల పర్యటన కోసం వచ్చారు. ఈ పర్యటనలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ GOAT టూర్‌లో భాగంగా మెస్సీ సందడి చేశాడు. ఈ పర్యటనలో మెస్సీ వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు, అభిమానులను కలిశారు. ఈ సందర్శన మీట్-అండ్-గ్రీట్ ఈవెంట్‌లకు మాత్రమే పరిమితం. ఈ కాలంలో అతను ఎటువంటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడడు. మెస్సీ ఒకటి లేదా రెండుసార్లు ఫుట్‌బాల్‌ను తన్నడం అభిమానులు చూసి ఉండవచ్చు.

కానీ అతను పూర్తి మ్యాచ్ ఆడడు. మీడియా నివేదికల ప్రకారం, మెస్సీ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అథ్లెట్ బీమా పాలసీలు ఉన్నాయి. అతని ఎడమ కాలుకు దాదాపు $900 మిలియన్లు లేదా దాదాపు 81.5 బిలియన్ రూపాయలకు బీమా చేసినట్లు కూడా నివేదించాయి. అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మొత్తం కారణంగా అధికారిక మ్యాచ్ లేకుండా మెస్సీ మైదానంలోకి దిగలేడు. ఈ బీమా మెస్సీ కెరీర్‌కు ముప్పు కలిగించే గాయాల వల్ల కలిగే నష్టాల నుండి అతన్ని రక్షిస్తుంది.
ఈ పాలసీలోని నిబంధనలలో ఒకటి ఏమిటంటే, అతను తన దేశం అర్జెంటీనా లేదా అతని క్లబ్, ఇంటర్ మయామి తరపున మాత్రమే ఆడగలడు. మరే ఇతర అనధికారిక పోటీలోనూ ఆడకూడదు. అతను అలా చేస్తే, అతను బీమా పాలసీకి అర్హులు కాడు. అందుకే బీమా వర్తించకపోవడం వల్లనే మ్యాచ్ ఆడలేడు. ఒకవేళ భారత్‌లో జరిగే సరదా మ్యాచ్‌లో మెస్సీకి ఏదైనా గాయమైతే అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రావు. ఇది అతని కెరీర్‌కు, ఆర్థిక ఒప్పందాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రిస్క్ కారణంగానే మెస్సీ ఇండియాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడట.
