ప్రతీ పురుషుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోండి, లేదంటే మీరు తండ్రి కాలేరు.

divyaamedia@gmail.com
2 Min Read

పురుషులలో సంతానం అనేది జీవశాస్త్రపరంగా పునరుత్పత్తి ప్రక్రియలో భాగం, ఇది శుక్రకణాల ద్వారా జరుగుతుంది, అయితే సంతానం లేకపోవడం అనేది స్త్రీ, పురుషులు ఇద్దరికీ సంబంధించిన సమస్య కావచ్చు అయితే పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతానం కలగని దంపతులను అడిగితే వారి మనోవేదన అర్ధ చేసుకుంటే.. ఈ విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది! ఈ సమయంలో ఒకవైపు మహిళలకు ఉన్న పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యల సంగతి అటుంచితే..

సంతానం విషయంలో పురుషుడి వీర్యం ఆరోగ్యం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అవును… రోజువారీ బిజీ జీవితం, అదే పనిగా కూర్చుని చేసే ఉద్యోగం, విపరీతమైన కాలుష్యంలో ప్రయాణం, తీవ్రమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, జంక్ ఫుడ్ కి అలవాటుపడిన జీవితం.. ఇక మద్యపానం, ధూమపానం వంటి బోనస్ అలవాట్లు వెరసి ప్రస్తుత సమాజంలో పురుషుడి ఆరోగ్యం, పునరుత్పత్తి సమర్థ్యం తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి. వీర్యం రంగు విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా…

వీర్యం రెగ్యులర్ కలర్ లో కాకుండా పసుపు రంగులో ఉంటే.. అది పచ్చ కామెర్ల వల్ల అయ్యే అవకాశం ఉందని.. లేదా, మీరు ఆల్కహాల్, సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటారని అర్ధం అని అంటున్నారు. ఇక… అదే వీర్యం కాస్త ఆకుపచ్చ, పసుపు మిక్సింగ్ కలర్ లో కనిపిస్తే అది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ / బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆరోగ్యకరమైన వీర్యంలా కాస్త చిక్కగా కాకుండా.. మీ వీర్యం పలచగా ఉందేమో కూడా చెక్ చేసుకోండి. ఒక వేళ కాస్త చిక్కగా కాకుండా నీళ్లగా పల్చగా ఉంటే.. మీ వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందని అర్ధం చేసుకోండి.

ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని మర్చిపోకండి. ఇదే క్రమంలో వీర్యం తక్కువ మోతాదులో స్కలనం అవుతుంటే అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన సమస్య అనే విషయం గుర్తుపెట్టుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంతే… వీర్యం మరీ తక్కువ మోతాదులో వస్తుంతే.. అది ప్రయాణించే నాళ్లాల్లో అడ్డంకులు ఉన్నాయని అర్ధం కావొచ్చని.. దీనివల్ల వీర్య కణాలు గర్భాశయం వరకూ చేరుకోలేవని.. ఫలితంగా సంతానోత్పత్తి జరగదని చెబుతున్నారు! ఇదే విధంగా…

సాధారణంగా అప్పుడప్పుడు చాలా మందికి వృషణాల వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇది వాతం వల్ల కావొచ్చని కొంతమంది అనుకుంటే.. కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతుందని మరికొంతమంది భావిస్తుంటారు! అయితే… అలా వాపు లేదా నొప్పి రావడం ఎపిడిడైమిటిస్, హైడ్రోసెల్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు! ఇక మరో అతి ప్రధాన సమస్య… వీర్యంలో రక్తం చుక్కలు కనిపించడం. అవును… మీ వీర్యంలో రక్తపు చుక్కలు కనిపిస్తే అది క్లామిడియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధి లక్షణం కావొచ్చు. లేదా.. తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు సంకేతమైనా కావొచ్చు.. ఇది నిర్లక్ష్యం చేసే చిన్న సమస్య కాదని మరిచిపోవద్దు!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *